![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -430 లో.. అమూల్య కాలేజీకీ వెళ్తుంటే తనకి ప్రేమ జాగ్రత్తలు చెప్తుంది. అప్పుడే ధీరజ్ వచ్చి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ప్రేమని ఉద్దేశ్శించి ధీరజ్ అంటాడు. నా చెల్లి విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకని ప్రేమతో ధీరజ్ అంటాడు. వదిన చాలా మంచిది అన్నయ్య అని అమూల్య అంటుంది. అయిన ధీరజ్ వినిపించుకోడు. ఆ తర్వాత శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యం వాళ్ళింట్లో మంచిగా నిద్రపోతుంటుంది. అప్పుడే తన దగ్గరికి భాగ్యం వస్తుంది. పాపం బిడ్డకి ఆ ఇద్దరు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఆ ప్రేమ, నర్మద వాళ్ళు ఎన్ని రోజుల వల్ల నా బిడ్డ నిద్రపోక ఎన్నిరోజులు అవుతుందోనని భాగ్యం అంటుంది. తనని నిద్రలేపుతుంది భాగ్యం. స్కూల్ టైం అయింది ఇంటికి వెళ్ళవా అని భాగ్యం నిద్రలేపుతుంది.
ఈ ఒక్క రోజుకి ఇక్కడే ఉంటానని చెప్పు అమ్మ అని భాగ్యంతో వల్లి అంటుంది. అప్పుడే నర్మద, ప్రేమ ఇద్దరు కలసి శ్రీవల్లికి ఫోన్ చేస్తారు. నువ్వు మాట్లాడిన రికార్డింగ్ చందు బావకి పంపిస్తున్నానని ప్రేమ అనగానే శ్రీవల్లికి టెన్షన్ మొదలవుతుంది. అప్పుడే చందు ఫోన్ చేస్తాడు. త్వరగా స్కూల్ కి వెళ్లి లోపల నుండి బయటకు వస్తుందిమ బయట తన కోసం చందు వెయిట్ చేస్తాడు. ప్రేమ ఏదో వాయిస్ రికార్డింగ్ పంపింది అనగానే నేను చూస్తానని వల్లి టెన్షన్ పడుతూ ఫోన్ లాక్కుంటుంది. ఆగు అని అది చందు ఓపెన్ చేస్తాడు. బావ స్కూల్ కి త్వరగా వెళ్ళండి అక్కడ అక్క వెయిట్ చేస్తూ ఉంటుందని ఉంటుంది. చూసావా ప్రేమ, నర్మదలకి నువ్వంటే ఎంత ప్రేమనో శ్రీవల్లితో చందు అంటాడు.
ఆ తర్వాత శ్రీవల్లి ఇంటికి వచ్చాక తనని ఒక అట ఆడేస్కుంటారు. మరొకవైపు ప్రేమ స్నానం చెయ్యడానికి బాత్రూంకి వెళ్తుంది. నలుగు పిండి మర్చిపోయానని బయటకు వస్తుంది. ఆ లోపు ధీరజ్ వెళ్లి స్నానం చేస్తాడు. ప్రేమ లోపలికి వెళ్తుంది. ఇద్దరు పడిపోతుంటే గట్టిగా పట్టుకుంటారు.. నాతో మాట్లాడవు గానీ నేను నీళ్లు పెట్టుకుంటే వచ్చి స్నానం చేస్తావా అని ప్రేమ అంటుంది. అలా ఇద్దరికి చిలిపి గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |